అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని మునిసిపాలిటీలలో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలు ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీలో కూడా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను మాజీ మంత్రి పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సీరియస్గా తీసుకున్నారు.


ఎలా అయినా ఈ సారి పుట్టపర్తిలో తెలుగుదేశం వారే చైర్మన్గా ఉండాలి అనే విధంగా ఆయన పుట్టపర్తిలోనే తిష్టవేసి అభ్యర్థుల ప్రచారం మొదలు అన్ని విషయాల్లోనూ శ్రద్ధ చూపిస్తున్నారు. పుట్టపర్తి లో మొత్తం 20 వార్డులు ఉండగా గత ఎన్నికలలో 15 వార్డుకు టిడిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు కూడా దాదాపు 15 వార్డులో గెలిచి పుట్టపర్తి మున్సిపాలిటీలో టిడిపి వ్యక్తిని చైర్మన్గా కూర్చో పెడతామని ఆయన చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రచారం చేస్తూ ఇప్పటికే చాలా వార్డులలో తిరుగుతున్నారు. చిరు వ్యాపారులు మొదలు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఈసారి ఫ్యాను గుర్తుకి ఓటు వేయకుండా సైకిల్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు.


వైసీపీ దురాగతాలు చెబుతూ ఖచ్చితంగా పుట్టపర్తిలో తెలుగుదేశం జెండా మళ్లీ ఎగుర వేస్తామని ఆయన దీమాగా చెబుతున్నారు.  నిజానికి గత ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే నియోజకవర్గాన్ని ఎప్పుడూ విడవకుండా ఆయన నియోజకవర్గ సమస్యల గురించి అధికారపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక అధికార వైసిపి కూడా ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో వాళ్లు కూడా ఈ సారి కచ్చితంగా పుట్టపర్తి మునిసిపాలిటీ లో తమ జెండా ఎగురవేయాలని చూస్తున్నారు. మరి ఈసారి ఓటర్లు ఎవరికీ మద్దతు పలుకుతారు ? ఎవరిని చైర్మన్ పీఠం మీద కూర్చో పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: