ష‌ర్మిల తెలంగాణ రాజ‌కీయాల్లో వ‌డివ‌డిగా ముందుకెళ్తున్నారు. అయితే ఆమెకు తెలంగాణ రాజ‌కీయాల్లో స‌హ‌క‌రించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడిగా ముద్ర‌ప‌డిన ఓ కీల‌క నేత స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఇది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌మేయంతో జ‌రిగిందా...? ల లేక స‌ద‌రు నేత రాజ‌కీయంగా మంచి వేదిక‌గా భావించి పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డుతున్న విష‌యం ఇంకా తెలియ‌రావ‌డం లేదు. ఒక‌వేళ స‌ద‌రు నేత క‌నుక పార్టీలో జాయిన్ అయితే మాత్రం కీల‌క మైన సామాజిక వ‌ర్గం పార్టీలోకి రావ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.


వైఎస్ హయాంలో  కీలకంగా వ్యవహరించిన ఆ నేత ప్రస్తుతం ఇప్పుడు ఓ పార్టీలో కొన‌సాగుతున్నా అంతగా ప్రాధాన్యత లేదనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఆయన పార్టీ మారాలనే యోచనలో ఉన్నారని.. వైఎస్ షర్మిల సైతం ఆ సీనియర్ నేత సేవలను తన పార్టీ కోసం వినియోగించుకోవాలని చూస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు జరిగాయని.. త్వరలోనే ఇందుకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేస్తారని సమాచారం. అయితే ఆయన నేరుగా షర్మిల కొత్త పార్టీలో చేరతారా ? లేక  వెనుక ఉండి రాజకీయ సలహాలు ఇస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది.


ఇదిలా ఉండ‌గా వైఎస్‌ షర్మిల.. ఏప్రిల్‌ 9న  ఖమ్మంలో లక్ష మందితో భారీ సభకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.  అదే వేదికపై పార్టీ ప్రకటన తేదీని వెల్లడించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి వైఎ్‌సఆర్‌ తన పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడానికి అదే రోజును షర్మిల ఎంచుకున్నట్లు తెలిసింది. ఖమ్మం నుంచి వచ్చిన పలువురు వైఎ్‌సఆర్‌ అభిమానులు గురువారం లోట్‌సపాండ్‌లో షర్మిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 9న ఖమ్మంలో సభ నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల.. చివరి సమావేశం ఖమ్మంలో చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: