తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం తార‌స్థాయికి చేరుకుంది. వ‌చ్చేనెల 14వ తేదీన న‌ల్గొండ‌, హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు ప్ర‌చారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గ‌ట్టిగా ఫోక‌స్ చేస్తోంది. న‌ల్గొండ స్థానం నుంచి అయితే అభ్య‌ర్థులు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నారు. పోటీలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, టీజేఎస్ నుంచి ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రెడ్డి, యువ‌తెలంగాణ నుంచి రాణిరుద్ర‌మ‌రెడ్డి, తీన్మార్ మ‌ల్ల‌న్న‌, చెరుకు సుధాక‌ర్ వంటి వారు పోటీ ప‌డుతున్నారు. హైద‌రాబాద్ నుంచి అధికార టీఆర్ ఎస్ నుంచి పీవీ వాణిని నిల‌బెట్టిన విష‌యం తెలిసిందే.


అధికార పార్టీకి రెండు స్థానాల్లో ఎంత బ‌లం ఉందో అదేస్థాయిలో వ్య‌తిరేక‌త ఉంద‌న్న‌విశ్లేష‌ణ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. న‌ల్గొండ స్థానం విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ అధికార పార్టీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు అధికంగా ఉన్నాయి. దీనికి తోడు కోదండ‌రాం రెడ్డి లాంటి ఉద్ధండుడు బ‌రిలో ఉండ‌టం మిగ‌తా అభ్య‌ర్థులు కూడా జిల్లాకు ఒక‌రు అన్న విధంగా ఉండ‌టంతో ఓట్లు బాగా చీలే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.ఓట్లు చీలినా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటే ప్ర‌తిధ్వ‌నిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు. అయితే టీఆర్ ఎస్ నాయ‌కులు మాత్రం ఈ విశ్లేష‌ణ‌ను కొట్టి పారేస్తున్నారు. ప‌ల్లా గెలుపుపై పూర్తి ధీమాను వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.


ఇక హైద‌రాబాద్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కూడా అన్ని పార్టీ చాలా ఫోక‌స్ పెట్టాయి. బ‌రిలో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌రావు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. వాణిదేవీ గెలుపున‌కు టీఆర్ ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఓటు వేసే ప్రతి విద్యావంతులు వాణి దేవికి ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.  ఆమెకు ఉన్న అర్హతలు, సానుకూలతలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో 24వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, తెలంగాణలో 10వేలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత తాము లక్ష 32 వేల799 ఉద్యోగాలకు పైగా భర్తీ చేశామని పేర్కొంటూ తాము చేసిన పాల‌న విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ ప్రజాభిమానాన్ని సాధించుకునేందుకు య‌త్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: