తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ నేతలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలంగాణలో బండి సంజయ్ స్పీడ్ గా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ వెనకడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకు ఏంటి అనేది తెలియక పోయినా తెలంగాణలో ఇప్పుడు ధరల పెంపుదల విషయంలో ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతున్నది.

దేశవ్యాప్తంగా కూడా ధరల పెరుగుదల అనేది భారతీయ జనతా పార్టీకి ప్రధాన సమస్యగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. రోజు రోజుకి కూడా ధరలు పెరగటమే గానీ తగ్గే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కంటే కూడా ఇప్పుడు దారుణంగా రేట్లు పెరగడం పై ప్రజలలో ఆగ్రహం పెరిగిపోతుంది. నెల రోజుల్లో దాదాపు 125 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.

దీనిపై సామాన్య ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. చాలామంది బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఇప్పుడు ఉన్నది అనే మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం ఏమో గాని ఇలాంటి వాటి ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు అనే ఆవేదన ఎక్కువగా ఉంది. అందుకే బండి సంజయ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోవచ్చు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి బండి సంజయ్ ఎలా ముందుకు వెళ్తారు చూడాలి. బిజెపి బలంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. ఇది టిఆర్ఎస్ పార్టీకి కూడా ఇప్పుడు అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: