ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.ఆస్కార్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం లో‌ వీఆర్వోలకు పదోన్నతి విషయంలో ఉద్యోగ సంఘాలు పోటీ పడుతున్నాయి అని ఆయన అన్నారు. 2019 ఏప్రిల్ లో మేము సమావేశం పెట్టి..‌అర్హులైన వీఆర్వోలకు ప్రమోషన్లు డిమాండ్‌ చేశాం అని ఆయన తెలిపారు. బొప్పరాజు  మాకు అన్యాయం చేశారని వీఆర్వోలు మమ్మలను ఆశ్రయించారు అని అన్నారు. మా సంఘం పని తీరు ను తప్పు బడటాన్ని ఖండిస్తున్నాం అని పేర్కొన్నారు. 103 జిఒ ద్వారా ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగుల ఇబ్బంది అయినా మాట్లాడ వచ్చుఅని తెలిపారు.

వీ ఆర్ ఒ లు ఇప్పుడు తమ సంఘం లో లేరని బొప్పరాజే అంగీకరించారు అని, ప్రమోషన్ వచ్చాక రెవిన్యూ సంఘంలోకి‌ వీఆర్వోలు వెళతారు అని తెలిపారు. మా సంఘం మీద ఆరోపణలు చేసిన వారు బొప్పరాజుతో కలిశారు అని మండిపడ్డారు. పదోన్నతిల జిఒ వచ్చాక... బొప్పరాజు కొత్త నాటకానికి తెర తీశారు అని మండిపడ్డారు. రెండళ్లు జూనియర్ అసిస్టెంట్ గా పని‌చేశాక.. సీనియర్ అసిస్టెంట్ లగా పదోన్నతి అని జిఒ లో ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ‌విషయాన్ని‌ పరిశీలించాలని మా సంఘం తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం అని అన్నారు.

వీఆర్వోల సంఘం పెద్దలు బొప్పరాజుతో వెళితే మాకు అభ్యంతరం లేదు అని ఆయన పేర్కొన్నారు. కానీ మా సంఘం పై బురద జల్లితే సహించేది లేదు అని స్పష్టం చేసారు. 60-40 నిష్పత్తి ప్రకారం  జూనియర్ అసిస్టెంట్, వీఆర్వోలు పదోన్నతి లు ఉన్నాయి అని, ఇప్పుడు వీఆర్వోల సంఖ్య పెరగడంతో ఈ నిష్పత్తి పెంచాలని మేము కొరుతున్నాం అని అన్నారు. ఒకటిగా ఉన్న అశోక్ బాబు  జేఎసిని‌ బొప్పరాజు విడగొట్టి అమరావతి జెఎసి పెట్టారు అని ఆయన ఆరోపించారు. ఇప్పుడు వీఆర్వోల మధ్య చిచ్చు పెట్టి.. తన గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు అని మండిపడ్డారు. సాక్షాత్తు సిఎం ను కలిసి మరీ మేము‌ విజ్ఞాపన లు చేశాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: