ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విఆర్వోల అసోసియేషన్ కి చెందిన ‌ప్రసన్నకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ వీఆర్వోల సంఘం పేరుతో బొప్పరాజు 50-50నిష్పత్తిని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు అని, కొంతమంది ని కూర్చోపెట్టుకుని చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం అని ఆయన మండిపడ్డారు. ప్రమోషన్ల లో అప్పుడు  520జిఒ ఇచ్చారు అని అన్నారు. ఇప్పుడు 86 శాతం ఉన్న వి.ఆర్.ఒ లకు యాభై శాతమే ప్రమోషన్ ఎలా ఇస్తారు అని నిలదీశారు. మూడు‌వేల మంది జగన్మోహన్ రెడ్డి హయాంలో డైరెక్ట్ గా రిక్రూట్ అయ్యారు అని ఆరోపించారు.

ఈ అంశాలను సిఎం దృష్టి కి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరతాం అని అన్నారు. నిన్న జరిగిన సమావేశం లో ఐదు శాతం వి.ఆర్.ఒ లు మాత్రమే బొప్పరాజు నిర్ణయానికి మద్దతు ఇచ్చారు అని మండిపడ్డారు. మాకు ఎటువంటి షరతులు లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని సిఎం నిర్ణయం చేశారు అని పేర్కొన్నారు. బొప్పరాజు.. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేయడం కరెక్ట్ కాదు అని మండిపడ్డారు. ఇంత కష్టపడి చదివినా.. అనుభవం ఉన్నా ప్రమోషన్ లేకపోవడం బాధాకరం అని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం పరిణామాలకు బొప్పరాజే కారణం అని ఆయన అన్నారు. సీనియర్ అసిస్టెంట్ గా 86 శాతం వి.ఆర్.ఒలకు, 14 శాతం జూనియర్ అసిస్టెంట్ లకు ప్రమోషన్ లు ఇవ్వాల్సిందే అని ఆయన స్పష్టం చేసారు. స్వార్దం కోసం కొంతమంది వంచన చేస్తే... సిఎం కు పరిస్థితి వివరిస్తాం అని అన్నారు. ప్రభుత్వం అంగీకారం తెలిపాక బొప్పరాజుకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అని నిలదీశారు. ఇప్పుడు అయినా ఆలోచించి‌.. విఆర్.ఒలకు మీ అసోసియేషన్ లో సభ్యత్వం ఇవ్వండి అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ వల్ల మా సమస్య పరిష్కారం అయ్యింది అని అన్నారు. ప్రభుత్వం 132జిఒ కూడా ఇచ్చి, ప్రమోషన్ లకు అంగీకరించింది అని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆటంకాలు కలిగించే విధంగా చేస్తే... మా ఆగ్రహానికి గురి కాక తప్పదు అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: