విశాఖలో ఎన్నికలు జరుగుతున్నాయి. జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిధ్ధమవుతోంది. పార్టీలు చమటోడుస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చేలా వాతావరణం కూడా సిధ్ధమవుతోంది. విశాఖలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని వార్డులు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నాయి. దాదాపుగా మూడవ వంతు వార్డులు ఇక్కడే ఉండడంతో మేయర్  రిజల్ట్ పైన పెను ప్రభావం చూపుతుంది అంటున్నారు. జీవీఎంసీకి సంబంధించి గాజువాక, పెందుర్తి పాంతాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇక్కడ కార్మిక వాడలు, కార్మికులు ఎక్కువగా ఉంటారు. పైగా సెగలు రేపుతున్న ఉక్కు కర్మాగారం కూడా గాజువాకలో ఉంది. దాంతో ఇక్కడ కార్మిక లోకం రగిలిపోతోంది. తమకు అన్ని పార్టీలు అన్యాయం చేశాయన్న భావనతో వారు ఉన్నారు. అందువల్ల తాము ఏ పార్టీని ఆదరించకూడదని గట్టిగానే తీర్మానించుకున్నాయని చెబుతున్నారు.  ఇక పారిశ్రామిక బెల్ట్ లో వామపక్షాలకు పట్టు ఎక్కువ. అందువల్ల వామపక్షాలకు ఈసారి ఈ ప్రాంతంలో ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓ విధంగా చూస్తే ఇక్కడ పాతిక నుంచి ముప్పయి దాకా వార్డులు ఉన్నాయి. మరి ఈ వార్డులలో గెలుపు కోసం అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఉక్కు కార్మికుల తరఫున పోరాటానికి తాము రెడీగా ఉన్నామని కూడా చెబుతున్నాయి.

అదే సమయంలో వైసీపీ అయితే అసలు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదు అంటోంది. తాము ముందుండి కార్మికుల తరఫున పోరాడుతామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఇంకో వైపు చూస్తే టీడీపీ కూడా ఉక్కు పోరాటాన్ని చేస్తోంది. అయితే ప్రధాన పార్టీల కంటే కూడా వామపక్షాలనే కార్మికులు నమ్ముకున్నారని అంటున్నారు. ఇక కొన్ని చోట్ల ఎన్నికలను బాయ్ కాట్ చేసే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి జీవీఎంసీ ఎన్నికల్లో పారిశ్రామిక బెల్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇపుడు ఆసక్తికరంగా ఉందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: