ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు మాత్రమే కాదు.. ఇక సాధారణ ప్రజలకు వాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనాను నియంత్రించాలంటే వాక్సిన్ తప్ప మరో మార్గం లేదు. పైగా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో సామన్యులకు వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ముందుగా 60 ఏళ్ళు పైబడిన వృద్దులకు, 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ మధ్యలో కోమార్భిటీస్ ఉన్న వాళ్ళకు మార్చి ఒకటి నుంచి వాక్సిన్ ఇవ్వనున్నారు..

ఇప్పటి వరకు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లకు వాక్సిన్ కోవిన్ సాఫ్ట్ వేర్ ను ఫాలో అవుతూ ఇచ్చారు. అయితే ఇపుడు వాక్సిన్ ఇచ్చే వాళ్ల కోసం కోవిన్ 2.0 సాఫ్ట్ వేర్ ను ఉపయోగించనున్నారు.. కొత్త సాఫ్ట్ వేర్ లో ప్రజలకు యాక్సిస్ ఇవ్వనున్నారు..

వాస్తవానికి హెల్త్ కేర్,  ఫ్రంట్ లైన్ వర్కర్ల తర్వాత యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళకు వాక్సిన్ ఇవ్వాలనుకున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనాతో ఎఫెక్ట్ అయి చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్లే దాంతో ముందుగా వీళ్లకే వాక్సిన్ ఇవ్వనున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. మరోపక్క 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వయసున్న వాళ్ళలో దీర్ఘకాలిక రోగాలున్న వారికి వాక్సిన్ ఇవ్వనున్నారు.

కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో  తెలంగాణలోనూ పెద్దలకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడ్తున్న వాళ్ళకు వాక్సిన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ రెండు కేటగిరీల్లో దాదాపు 55 లక్షల మంది ఉంటారని అంచనా. వాక్సిన్ పంపిణీ మొదలైతే ఆరు నెలల్లో మొదటి రెండో డోసులు పూర్తి చేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు.

కేంద్రప్రభుత్వం ఒక వైపు టీకాను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈసారి ప్రయివేట్  సెంటర్లలో కూడా టీకా వేసుకునే అవకాశం కల్పించనుంది. అయితే ప్రయివేట్ టీకా వేసుకుంటే డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయివేట్ సెంటర్లలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా టీకా పంపిణీ చేయాలంటున్నారు నిపుణులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: