ఏపి టీడీపీ యువత నేత లోకేశ్ బాబు మరోసారి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాటల యుద్దానికి దిగాడు. ఇటీవల జరిగిన నాలుగు విడతల స్థానిక ఎన్నికల్లో 38.89 శాతం పంచాయతీలను తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. .. రాష్ట్రంలో వైసీపీ పాలన చూస్తుంటే.. 'పబ్లిసిటీ పీక్..మ్యాటర్ వీక్' అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సన్నబియ్యమే ఒక ఉదాహరణగా చెప్పారు. 'ఎన్నికల ముందు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యంకాదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామన్నారు.. తర్వాత వేల కోట్లు ఖర్చుచేసి వాహనాలు ఏర్పాటు చేశారు...


ఆ వాహనాలు వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. వారికి ఇవ్వవలసిన జీతాలను కూడా ప్రజల పై భారాన్ని మోపుతున్నారు. రేషన్ సరుకులు పై అంతకు మించి ధరలను వసూల్ చేయడం వల్ల ప్రజలు ఛీ కొట్టారు. దాంతో అంతే వేగంగా వెనక్కు వచ్చేశాయి. కోట్లు ఖర్చు పెట్టిన వాహనాలు ఇప్పుడు తాడేపల్లి గూడెం లో మురుగుతున్నాయి. ఇది జగన్ పాలన అంటూ ఎద్దేవా చేశారు. బాదుడే బాదుడు అంటూ పన్నులతో జగన్ రెడ్డి...జనం నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, రూ.200 వచ్చేది రూ.1000 వచ్చిందని, వెయ్యి వచ్చేది, ఏడెమినిది వేలు వస్తోందని అన్నారు.


ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, పెట్రోలు, డిజిల్ ధరలు సెంచరీకి చేరువలోకి వచ్చాయన్నారు. చెత్త ఎత్తడానికి కూడా పన్ను వేస్తున్నారని, రేషన్ సరుకుల ధరలు పెంచారని మండిపడ్డారు. పథకాల పేరుతో పది రూపాయలు ఖర్చు చేసి వెయ్యి రూపాయలను వసూలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు పదివేల మందిని సర్వే చేశామని, ప్రజలు ఆశిస్తున్నదేంటో తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు.మూతపడిన అన్నా క్యాంటీన్లు తెరుస్తామని, ఐదు రూపాయలకే భోజనం పెడతామన్నారు. మళ్లీ ఆంధ్రను స్వర్ణాంధ్ర గా మారుస్తామని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: