ఇప్పుడు ఎవరు చూసినాగాని ఎక్కువగా వినియోగించేది ఫేస్ బుక్. అయితే ఈ ఫేస్ బుక్ సంస్థకి రెండో అత్యున్నత అధికారిగా ఉన్న షెరిల్‌ శాండ్‌బర్గ్‌ తనకు  కాబోయే భర్త టామ్ బెర్న్తాల్‌కు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తన మొదటి భర్త చనిపోయిన సమయంలో  తనకు తోడుగా ఉండి, నా బాధని పంచుకున్నందుకు అలాగే తన జీవితంలో మరో సారి ప్రేమను వికసింపజేసినందుకు తనకి  ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు షెరిల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక ప్రేమ పూరితమైన భావోద్వేగ లెటర్ రాసింది.  ‘‘2015లో నా భర్త డేవ్‌ చనిపోయారు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న నేను విచారంలో ఉండి పోయాను. ఒక్కసారిగా నా ప్రపంచం అంతా తలకిందులుగా  అయిపోయింది. నా మొదటి భర్త డేవ్‌ నన్ను ఎంతో ప్రేమించాడు. నా జీవితంలో అంతలా ప్రేమించే వ్యక్తిని మళ్లి కలుస్తానని అనుకోలేదు. కానీ డేవ్‌ సోదరుడు రాబ్‌ నా గురించి చాలా ఆలోచించాడు. దానిలో భాగంగానే తన స్నేహితుడు టామ్‌ బెర్న్తాల్‌ని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత నా ప్రపంచం పూర్తిగా మారిపోయింది’’అని అన్నారు.  ‘‘డేవ్‌ని కోల్పోయి బాధపడుతున్న నన్ను టామ్‌ ఓదార్చాడు. నాకు ధైర్యం చెప్పాడు. డేవ్‌ నన్ను ఎంతలా ప్రేమించేవాడో.. టామ్‌ అంతకన్నా ఎక్కువ ప్రేమను పంచాడు.


మనల్ని ప్రేమించిన వారు దూరమైతే బాధపడటం సహజం. కానీ వారి కన్నా అధికంగా ప్రేమించే వారు తారసపడితే.. వారితో ముందుకు సాగడం ఎంతో ఉత్తమం. వారి ప్రేమ మన సంతోషాల్ని తిరిగి తెస్తుంది. నా విషయంలో ఇదే జరిగింది. రెండు కుటుంబాల ఆమోదంతో మేం కొత్త మార్గంలో ముందుకు సాగనున్నాం. తన బహిరంగ లేఖలో షెరిల్‌ శాండ్‌బర్గ్ తన కాబోయే భర్త టామ్‌కు గల అనేక మంచి లక్షణాలను వివరించారు.


భాగస్వామిగా, తన బిడ్డలకు మంచి తండ్రిగా ఉంటాడని తెలిపారు. తన పిల్లల జీవితాలలో పాలుపంచుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. "నిజం, నువ్వు నా జీవితంలోకి రాక ముందు నేను చాలా అలసిపోయాను టామ్ ఇప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉందంటు  రాసుకొచ్చారు. మొదటి భర్తను కోల్పోయిన బాధ తన హృదయంలో అలాగే ఉంటుందని ఒప్పుకున్నారు షెరిల్‌. ".ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అయిన షెరిల్‌ శాండ్‌బర్గ్‌, టామ్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గతేడాదే ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: