మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం పై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా వరకు కూడా ఆసక్తికర చర్చలు నడుస్తూ ఉంటాయి. ఆయన ఎటు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆయన విషయంలో మాత్రం వైసీపీ నేతల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంది. అయితే గంటా శ్రీనివాసరావు విషయంలో గత కొన్ని రోజులుగా చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువైనా జరిగింది. అయితే తాను ఏ పార్టీలో కి వెళ్తాను ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అని చెప్పాలి.

కానీ గంటా శ్రీనివాసరావు విషయంలో వైసీపీ వర్గాలతో పాటు భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా చూసాయి. అయితే ఇప్పుడు పార్టీలోనే కొనసాగి ఆలోచనలో ఉన్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయని ప్రచారం రాజకీయ వర్గాలలో జరిగింది. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోనే ఉండే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఎందుకు అంటే... చంద్రబాబు నాయుడు నుంచి పెద్ద ఆఫర్ గంటా శ్రీనివాసరావుకు వచ్చిందని సమాచారం.

ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఏమీ చెప్పలేకపోయారని అందుకే ఆయన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు అని అంటున్నారు. ఈ భారీ ఆఫర్ ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా సరే గంటా శ్రీనివాసరావు మారకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ జిల్లాలో బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి దీన్ని గంటా శ్రీనివాసరావు ఎంత వరకు వాడుకొని తెలుగుదేశంకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: