ఏ మాటకు ఆ మాట ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కాస్త ప్రభావం చూపించింది అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అలాగే వైసీపీని కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఇబ్బంది పెట్టడం మనం చూసాం. ఇక ఆ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే ఉన్నారు. జనసేన పార్టీ నేతలతో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు.

పీఠం కదులుతుందన్న భయంతోనే జనసేనపై దాడులు చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మత్స్యపురిలో దళిత మహిళా సర్పంచ్, మత్స్యకార మహిళ వార్డు మెంబర్లను అవమానించారు అని ఆయన ఆగ్రహం వ్యక్ల్తం చేసారు. దాడులకు తెగబడ్డారు అని మండిపడ్డారు. భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ, బ్యాంకును దోచేసిన వ్యక్తి  అని ఆయన ఆరోపించారు. అతను మరోలా ప్రవర్తిస్తాడని మనం ఆశించకూడదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  మున్సిపల్ వ్యాన్ వస్తుంది... పిచ్చి కుక్కను తీసుకెళ్తుంది  అన్నారు.

అప్పటి వరకు అందరూ సంయమనం పాటించండి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే సంయమనం మాకు లేదు అని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం చూసి ఓర్వలేక  వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు అని పవన్ మండిపడ్డారు. ప్రత్యర్ధులను హింసించడమే వైసీపీ నాయకుల డి.ఎన్.ఎ అని ఆయన ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి వేరే పార్టీల ప్రత్యర్ధులను హింసించే పనిలో ఉన్నారు అని మండిపడ్డారు. ప్రజాసేవ వాళ్లు చేయరు. ఎదుట వారిని చేయనివ్వరు అని అన్నారు. పరిస్థితి అలా ఉంది కాబట్టే ఇవాళ జనసేనను ప్రజలు ఆదరిస్తున్నారు అని పవన్ వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: