జగన్మోహన్ రెడ్డి పాలన పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేసారు. 20నెలల్లో ప్రజలకు చేసింది శున్యo. శాంతి భద్రతలు అదుపు తప్పటంతో బులెట్ లేని గన్ గా జగన్ మిగిలారు అని ఆయన ఆరోపించారు. రూ.200వచ్చే విద్యుత్ బిల్లులు రూ. వెయ్యి వస్తున్నాయి. ఇతర నిత్యావసరాలు భారీగా పెంచారు అని ఆయన మండిపడ్డారు. ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపారు అని ఆరోపించారు. పట్టణ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వ చర్యలున్నాయు అని ఆరోపించారు.

అందుకే 10 వాగ్ధానాలతో మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం అని అన్నారు. అన్నా కాంటీన్లు తెరిచి రూ.5కె భోజనం పెడతాం అని ఆయన హామీ ఇచ్చారు. పాత పన్ను మాఫీ చేసి ఇకపై సగం పన్నే వసూలు చేస్తాం అని అన్నారు. శుభ్రమైన ఊరు శుద్ధమైన నీరు అమలు చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. నిరుద్యోగ యువతకు ప్రతి 6నెలలకోసారి ఉద్యోగమేళా నిర్వహిస్తాం అని ఆయన అన్నారు. సుందరీకరణ మిషన్, చెత్త లేని నగరం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్ల కు అన్ని సదుపాయాలతో ఆటో స్టాఅండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

మెప్మాలు బలోపేతం తో పాటు పట్టణ పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని అన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21వేలకు పెంచుతాం అని హామీ ఇచ్చారు. జగన్ పిరికివాడు కాబట్టే విశాఖ ఉక్కు పరిశ్రమ, స్టీలు ప్లాంట్ వదిలేశారు అని ఆయన ఆయన ఆరోపించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలన్నీ అమ్మేస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ ది బులెట్ లేని గన్ అని మండిపడ్డారు. దిశ చట్టం తీసుకువచ్చి ఏమీ చేయలేదు  అని అన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి అని ఆయన ఆరోపించారు. మన రాష్ట్రంలో డబుల్ సెంచరీ దాటినా ఆశ్చర్యం లేదు అన్నారు. ఒక ఛాన్స్ అని జగన్ రెడ్డి రాష్ట్రాన్నే నాశనం చేశారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: