2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన తరువాత ఎక్కడ పట్టువిడవకుండా పోరాడిన పవన్ కళ్యాణ్ శ్రమ ఇప్పుడిప్పుడే పలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీపై ప్రజలందరిలో నమ్మకం పెరిగిపోతుంది. అయితే పవన్ కళ్యాణ్  పార్టీని ప్రజలు నమ్మి అండగా నిలబడుతున్నారు అనడానికి ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కంటే జనసేన పార్టీ వైపే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపారు.



 ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో అయితే జనసేన బలం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో మిగతా జిల్లాలకు కూడా జనసేన పార్టీ పాకి  పోయే అవకాశం ఉంది అని ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేన విజయాలు ఆంధ్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జనసేన పార్టీ మంచి విషయాలను అందుకుంటు ఉండగా అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ నుంచి కూడా ఎంతోమంది గెలిచినవారు జనసేన పార్టీలోకి వస్తున్నారు. అంతేకాదండోయ్.. అధికార వైసీపీ పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు జనసేన వైపు వస్తూ ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.



 తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లో మాచవరం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన  మంచాల వీరబ్బాయి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి 20 మంది కార్యకర్తలతో జనసేన పార్టీలో చేరారు. ఇక రావిపాడు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కొంతమంది జనసేన పార్టీలో చేరారు. ఇలా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో పోలరైజేషన్ ఆఫ్ జనసేన అనేటువంటిది ఎంతగానో పెరిగింది అని అంటున్నారూ విశ్లేషకులు. ఇక ఈ రెండు జిల్లాల్లో ప్రస్తుతం కాపు సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాల నుంచి సపోర్ట్ లభిస్తుండటంతో జనసేన సెగలు పుట్టిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: