భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు అనే విషయం తెలిసిందే.  ప్రస్తుతం భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో  ఎన్నో రకాల సంప్రదాయాలు ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి.  ప్రస్తుతం దేశం మొత్తం టెక్నోలజీ వెంట పరుగులు పెడుతుంటే అటు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉన్నాయి. ఇవి  తెరమీదికి వస్తూ ఉండడం అందరిని  ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే దేశంలోని ప్రతి ప్రాంతంలో కూడా ఎన్నో చిత్రవిచిత్రమైన ఆచారాలు అప్పుడప్పుడు తెరమీదికివస్తూ ఉంటాయి.


 ఇక ఇటీవలే మరో వింత సాంప్రదాయం గురించి తెర మీదికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సాధారణంగా లీగల్ గా అయితే ఒక వ్యక్తి ఓకే పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి అంటే మాత్రం మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం లాంటివి చేయాలి అలా చేయకుండా రెండో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం రెండో పెళ్లి చెల్లదు అని చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అలా కాదు తప్పకుండా ప్రతి ఒక్కరూ రెండవ పెళ్లి చేసుకోవాల్సిందే. అదే ఇక్కడి ఆచారం. ఎన్నో రోజుల నుంచి ఇలా ప్రతి ఒక్కరు రెండో పెళ్లి చేసుకునే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.



 అయితే ఆ తర్వాత టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ఇలా ఒకే భార్య కావాలనుకుని  రెండో భార్య వద్దు అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇలా ఒకే పెళ్లి చేసుకున్న వారికి సంతానం కలగదట.  అందుకే మొదటి భార్య ఏకంగా ఒక అమ్మాయిని చూసి కట్టుకున్న భర్తకు రెండో పెళ్లి కూడా చేస్తుందట. ఇక ఆ తర్వాత రెండవ భార్యకు సంతానం కలిగిన తర్వాత అప్పుడు మొదటి భార్యకు సంతానం కలుగుతుందట. ఇప్పటికీ కూడా అందరికీ ఇలాగే జరుగుతుండడంతో ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఇలాంటి ఆచారమే కొనసాగుతోంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా దేరాసర్ అనేటువంటి ప్రాంతంలో ఈ వింత ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: