సాధారణంగా మన దేశంలో బతుకుపోరాటం కోసం ఎంతో మంది వివిధ దేశాలకు వెళుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. దేశంలో ఉన్న ఉపాధిని కాదని విదేశాల్లో కి వెళ్లి అక్కడ ఉపాధిని దక్కించుకుంటారు. తద్వారా భారీగా సంపాదించి కుటుంబాన్ని చూసుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే భారత్ నుంచి లక్షల మంది అరబ్ కంట్రీస్ కి వలస వెళ్తున్నారు అన్న విషయం తెలిసిందే. పుట్టిన ఊరు ను కుటుంబాన్ని అన్ని వదిలేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశతో అరబ్ కంట్రీస్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు భారతీయులు.


 కానీ అక్కడ మాత్రం అనుకున్న విధంగా ఉండదు అనే విషయం తెలిసిందే.  అక్కడికి వెళ్లి ఎంతో డబ్బు సంపాదించి ఉన్నత స్థానానికి ఎదగాలి అని అనుకున్నప్పటికీ అక్కడ మాత్రం..  సరైన ఉపాధి దొరక్క చివరికి చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడతారు. కనీసం ఆరోగ్యం బాగా లేకపోతే ఆస్పత్రికి వెళ్లి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే ఇలా అరబ్ కంట్రీస్ కి వెళ్లి ఎన్నో అవస్థలు పడుతూ.. తమను  స్వదేశానికి రప్పించాలి  అంటూ ఎంతో మంది చేసిన  వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎన్నో తెరమీదకు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే సాధారణంగా ఒక దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఆ దేశాల ప్రభుత్వాలు కేవలం వారి దేశస్థులకు ముందుగా ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగతా వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇలా అరబ్ కంట్రీ అయిన ఖాతార్  కూడా ఇది కొనసాగింది. అక్కడికి వలస కోసం వెళ్లిన వారు కనీస వసతులు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయం అందక... ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఉపాధి అవకాశాల కోసం వివిధ దేశాల నుండి ఖతార్ కు వెళ్లి  వైరస్ కాటుకు బలైన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మొత్తంగా ఒక ఖాతార్  లోనే  6500 మంది చనిపోయారట. గత పది సంవత్సరాలలో ఒక్క దేశంలోనే ఇంత  మంది చనిపోతే ఇక మిగతా దేశాల్లో పరిస్థితి ఏంటో అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: