ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఒక మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం వివాహం... వివాహం అనేది ఒక అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే చాలా ముఖ్యమైన ఘట్టం. భార్య భర్తల అనుబంధం వెలకట్టలేనిది. తల్లి దండ్రులు తరువాత ఒక మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించేది ఎవరంటే భార్య అనే చెప్పాలి. అలాగే భార్యకు భర్త అని చెప్పాలి. అంతటి గొప్ప అనుబంధం పెళ్లి. అయితే మనం సమాజంలో చూస్తూ ఉంటాము. చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకుంటారు. కాని అది చాలా పెద్ద తప్పు. పెళ్లి అయిన తరువాత ప్రేమ లేకున్నా కాని ప్రేమ కలగజేసుకొని ఇద్దరు భార్య భర్తలు కలిసి మెలిసి జీవించాలి. ఇక చాలా మంది కలిసి జీవించలేక విడాకులు తీసుకుంటూ ఉంటారు...ఆ విడాకులు కొంతమంది ఇద్దరు ఇష్టపూర్వకంగా తీసుకుంటారు. అలాగే ఒకరికి నచ్చుతుంది ఇంకొకరికి నచ్చదు...


తాజాగా చైనాలో ఒక సంఘటన జరిగింది. చైనాకి చెందిన ఒక భార్య భర్తల జంట విడాకుల విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది... చెన్ అనే వ్యక్తి యంగ్ అనే స్త్రీని 2015 లో వివాహం చేసుకున్నాడు. కాని అతనికి అతని భార్య నచ్చక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ విడాకులకు అతని భార్య ఒప్పుకోలేదు. ఇక ఇద్దరు కోర్టుకి వెళ్లడం జరిగింది. మొదట భార్య విడాకులకి ఒప్పుకోలేదు.తరువాత ఒప్పుకుంది కాని ఆ ఐదు సంవత్సరాలకు ఇంటి చాకిరి చేసినందుకు తనకు భరణం కావాలని డిమాండ్ చేసింది.


ఆ ఐదు సంవత్సరాలకి గాను తనకు 50 వేల యువాన్ లు అంటే ఇండియన్ కరెన్సీలో 5.6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక అందుకు అక్కడి చైనా ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అంగీకరించాయి. ఇక సదరు వ్యక్తి కి నెలకు 2 వేల యువాన్ ల కింద ఆమెకి ఇంటిచాకిరీ భరణం ఇచ్చి విడాకులు తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది...కాని కొంతమంది మాత్రం ఇన్నాళ్లు తన భార్యను పోషించినందుకు భరణం విషయంలో సమానంగా తీర్పు ఇవ్వాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు....ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: