ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తాము జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు నేడు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి గత ఏడాది మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే అప్పుడు తమ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ విషయాలను పట్టించుకోకుండా ఇప్పుడు మళ్లీ అదే నోటిఫికేషన్ను కొనసాగించడంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎన్నికల సంఘం పై చేస్తున్నారు.

 తెలుగుదేశం పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు విపక్షాలు అన్నీ కూడా హైకోర్టుకు వెళ్లి తమ గోడును వెల్లబోసుకున్నారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికల సంఘం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ఆరు నెలలు వాయిదా పడితే మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి మళ్లీ అదే విధంగా ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యం కానిపని.

దీంతో విపక్షాలు అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం హైకోర్టుకి వెళ్ళగా హైకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసింది. తాము ఎటువంటి జోక్యాన్ని కూడా ఎన్నికల సంఘం విషయంలో చూపించలేమని  అని అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇక దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీవాల పై ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సీరియస్ గా ముందుకు వెళుతుంది. అయితే సుప్రీంకోర్టుకు వెళ్తా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: