ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. సమర్థవంతమైన నాయకులకు పదవులు ఇస్తూ చంద్రబాబు నాయుడు కొంతమందిని ప్రోత్సహించే కార్యక్రమాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని అంశాలను ప్రధానంగా సరిదిద్దాల్సిన అవసరం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని సమస్యలను పార్టీ ఎక్కువగా ఎదుర్కొంటుందని చెప్పాలి. ప్రధానంగా బీసీ సామాజికవర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాయి. అలాగే కాపు సామాజికవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉందనే చెప్పాలి ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అనే ముద్రను వైసిపి బలంగా వేయడంతో చంద్రబాబునాయుడు కాస్త ఎక్కువగానే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్న కు చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించారు.

ఆయనకు పూర్తి స్వేచ్చ ఇచ్చే అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు అచ్చెంనాయుడుకి బాధ్యతలు అప్పగించే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్త వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అన్నీ కూడా పూర్తిస్థాయిలో అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా బీసీలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఒక బీసీ కి పూర్తి స్వేచ్ఛనిచ్చారు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఆయన  వద్ద జరిగిన పంచాయతీలను మళ్లీ చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళితే చంద్రబాబు నాయుడు మరో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అచ్చెన్నకు విలువ ఉండదు. అందుకే ఇప్పుడు చాలామంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇక తాజాగా విజయవాడ పంచాయతీ తో పాటు కొన్ని సమస్యలను పరిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: