గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే మాట వాస్తవం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడాలంటే ఈ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని కొన్ని సమస్యలను పరిష్కరించుకునే విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమవుతున్నది. ఇప్పుడు నారా లోకేష్ మాత్రం ఓదార్పు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా మీద కూడా దృష్టి పెట్టి పంచాయతీ ఎన్నికల్లో జరిగిన గొడవ లో మరణించిన వారికి సంబంధించి ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపే విధంగా నారా లోకేష్ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. నారా లోకేష్ వ్యాఖ్యల విషయంలో కూడా ఇప్పుడు అధికార పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది అని చెప్పాలి. కొడాలి నాని మాట్లాడే మాటలను నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయకపోతే ఎన్నికల్లో బరిలోకి దిగినా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తామని హెచ్చరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి.

ఆయన ఇదే అంశంపై మాట్లాడుతూ కొడాలి నానీ భాషలో సమాధానం చెప్పారు. దీని పై తెలుగుదేశం పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని రోజులు కూడా క్రమశిక్షణ పేరుతో మాటలను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు నారా లోకేష్ వైఖరి చూసి కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇక ఆయన బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: