తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. దీని వెనుక ప్రధాన కారణం ఏమిటనే దానిపై స్పష్టత లేదు కాని కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లోకి వచ్చి మాట్లాడే విషయంలో కంగారుపడుతున్నారు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మినహా పెద్దగా ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.

ఇక మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ గా ఉండటంతో తెలుగుదేశం పార్టీ వర్గాలలో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయటం లేదు. మొన్న ఆ మధ్య ఆయన కాస్త కనపడిన సరే ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇక అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పెద్దగా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేయడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు కూడా ఆయన పెద్దగా ధైర్యాన్ని ఇవ్వలేదు.

దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని స్థానికంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నా సరే క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్యలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టనున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కొన్ని సమస్యల మీద నేరుగా దృష్టి సాధించలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. అందుకే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పార్టీలో సైలెంట్ గా ఉంటున్నారు అని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీరు పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: