సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకునే విషయంలో ఎమ్మెల్యేలు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లే అవసరం ఉన్న సోషల్ మీడియాలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నా సరే పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ఓటమి పాలైంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఇదే అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నది.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను ప్రధానంగా తీసుకుని ముందుకు వెళుతుంది. అందులో ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో జరుగుతున్న లోపాలను ప్రజలకు వివరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. అయినా సరే ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం కూడా పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే స్పష్టంగా అర్థం అవుతుంది. రాష్ట్ర స్థాయిలో ప్రచారం చేయడం లేకపోతే మంత్రులు ఒకరిద్దరు మీడియాతో మాట్లాడటం మినహా పెద్దగా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది.

కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే జగన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. కాని దీనిని కూడా సమర్థవంతంగా వైసీపీ నేతలు వాడుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటీ అమలు జరుగుతున్నాయని ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదని ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం కూడా వైసీపీ నేతలు చేయలేకపోతున్నారు. దీనివలన అనేక సమస్యలు నియోజకవర్గాల్లో వస్తున్నాయి. మరి దీని మీద ఎంత వరకు దృష్టి పెడతారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: