తెలంగాణలో కొంత మంది నేతలతో సీఎం కేసీఆర్ మాట్లాడే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలలో ఎక్కువగా ఉంది. కొంతమంది నేతలను ఆయన దగ్గర చేసుకోలేకపోతున్నారు అనే అభిప్రాయం కూడా ఎక్కువగానే ఉంది. ఉమ్మడి జిల్లాలకు చెందిన కొంతమంది నేతలను పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కేసీఆర్ మాట్లాడి దాదాపుగా రెండేళ్ళు  అవుతుంది అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి.

2018 ఎన్నికల్లోకి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి తర్వాత మళ్లీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఇక 2019 ఎన్నికల్లో ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వలేదని ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు. అప్పటి నుంచి ఆయన ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనీసం కేటీఆర్ కూడా వీరిద్దరి తో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. దీంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అసలు జిల్లాలో ఎం జరుగుతుందో  కూడా వాళ్ళకి అర్థం కావడం లేదనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

కొంతమంది నేతలు సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నా సరే వీళ్ళిద్దరూ సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెప్తున్నా వీళ్లిద్దరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. వీరితో బిజెపి నేతలు చర్చలు జరుపుతున్నారని తెలిసినా సరే సీఎం కేసీఆర్ మాత్రం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కావడం లేదు. రాజకీయంగా ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టకపోతే మాత్రం పార్టీ చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: