బీజేపీ అధిష్టానం తిరుపతి ఉప ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏమిటనేది తెలియదు. కానీ చాలా వరకు భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా కొంతమంది నేతలు ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని కొన్ని సమస్యలను పరిష్కరించుకునే విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా తిరుపతి పరిధిలో ఉన్న చాలామంది జనసేన పార్టీ నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు. అవసరమైతే తెలుగుదేశం పార్టీలో కూడా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో గట్టిగా వ్యవహరించే లేదంటే మాత్రం రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు భారతీయ జనతాపార్టీ దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కి సర్ది చెప్పినా సరే జనసేన పార్టీ నేతలను మాత్రం ఒప్పించలేకపోతే భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయకుండా జనసేన పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో లొంగిపోయి ఉన్నారు అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుందని చెప్పాలి. కార్యకర్తలు అభిప్రాయం మాత్రం పవన్ కళ్యాణ్ తీసుకోకపోతే మాత్రం ఇంకా కష్టాలు పెరుగుతాయి. మరి దీని మీద బిజేపీ ఎం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: