తెలంగాణలో రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ తరపున బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటే మాత్రం కొంత మంది కీలక నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ముందు నుంచి కూడా జరుగుతుంది. ఎవరు మారతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా కొంతమంది నేతలకు మాత్రం రేవంత్ రెడ్డి విషయంలో కాస్త ఆగ్రహం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రెడీ అయింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నారని... పార్టీ మారడానికి రెడీ అయ్యారు అని... దీంతో ఇప్పుడు అందరి మీద కూడా టిఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది అని ప్రచారం మొదలయింది. భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుపుతున్న కొంతమంది కాంగ్రెస్ నేతలకు నేరుగా మంత్రి కేటీఆర్ హామీలు ఇస్తున్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి సీటు ఇస్తామని తమ పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలుస్తుందా లేదా అనే దానిపై అనేక సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో సీఎం కేసీఆర్ కూడా జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు పార్టీ మారిపోయే అవకాశాలు ఉండవచ్చు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తో  పొసగని చాలామంది క్షేత్ర స్థాయి నేతలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి టిఆర్ఎస్ పార్టీలో ఎంత వరకు అవకాశాలు వస్తాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: