తెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కొంతమంది బిజెపి నేతలు సహకరించడం లేదనే వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. ప్రధానంగా బిజెపి సీనియర్ నేతలకు ఆయనకు మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. ఆయనను పార్టీలో ఉంచుకోవడానికి కొంతమంది కష్టపడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.

బండి సంజయ్ ను ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా బిజెపి అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బండి సంజయ్ కు సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయనకు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు కూడా మంచి సంబంధాలు లేవని కానీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న మరి కొన్ని వార్తలు ఏంటి అంటే బండి సంజయ్ తో ఎవరికైనా సమస్యలు ఉంటే ఆయన తో కూర్చుని మాట్లాడుకునే విధంగా ఇప్పుడు వాతావరణం కల్పించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ నేతలు కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే జిల్లాల్లో చాలా వరకు భారతీయ జనతా పార్టీకి బలం లేదు అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు పార్టీలో ఎలాంటి విభేదాలు వచ్చినా సరే ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు బండి సంజయ్ తో మాట్లాడి కొన్ని జిల్లాల బాధ్యతలను కొంతమంది తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 32 రెండు జిల్లాల బాధ్యతలను బండి సంజయ్ ఒప్పించి కొంతమంది నేతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపించి తర్వాత పదవులు కూడా పొందాలని బిజెపి నేతలు సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: