ఏపీలో ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. ఇంతలో మళ్ళీ మరో ఎన్నికల పిటీషన్ తో అన్ని రకాల రాజకీయ పార్టీలకు మరియు కార్య కర్తలకు నిదుర లేకుండా చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక అప్పటి నుండి మళ్ళీ రాజకీయ రానా రంగం షురూ అయ్యింది. మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఎలా అయితే ఎన్నికలు జరిగాయో అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అయితే మరో వైపు ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సంఘం పై దుమ్మెత్తి పోస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల సందర్భంలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా ఉన్నారని విమర్శలు చేస్తున్నారు.

రాజకీయాలలో ఇవి అన్నీ మాములే అని నిమ్మగడ్డ తన పనేమిటో తాను చూసుకుంటున్నాడు. అయితే కర్నూల్ లో జరగనున్న కేఎంసీ మేయర్ ఎన్నికలను వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పంచాయతీలలో తమకు తిరుగులేదని నిరూపించుకున్న జగన్ ఇప్పుడు అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే అన్ని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎన్నికలనుద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ నగరం జగన్ అన్న సీఎం అయ్యాక అభివృద్ధి పదంలోనే నడుస్తుందని తెలిపారు. కర్నూల్ నగర ప్రజలపై తమకు విశ్వాసం ఉందని వైసీపీ ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న అన్ని సమస్యలపై దృష్టి సారించామని, దీనితో ప్రజలంతా మా పార్టీపై సంతృప్తిగానే ఉన్నారని పేర్కొన్నారు.

టిడిపి కర్నూలు అసెంబ్లీ ఇన్‌ఛార్జి టిజి భరత్ ప్రజలను వైసీపీని విభేదించమని వేడుకుంటున్నారు మరియు గత రెండేళ్లలో నగరం నిర్లక్ష్యం చేయబడిందని అన్నారు. మేయర్ సీటును గెలుచుకుంటామని మాకు నమ్మకం ఉంది మరియు మేము నగరాన్ని అభివృద్ధి చేస్తాము. రక్షిత నీటి సరఫరా మరియు వరద భద్రతా గోడ నిర్మాణం అవసరం, ’’ అని ఆయన అన్నారు, అధికారానికి ఓటు వేస్తే టిడిపి ఈ సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. కొన్ని రోజులో జరగబోయే కేఎంసీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో మేయర్ పీఠం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: