ఈ మధ్యకాలంలో సాధారణంగా ఉన్న అందం  కంటే మరింత అందంగా కనిపించడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడానికి ముఖానికి ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఇక ముఖంలోని  ప్రతి పార్ట్ ని కూడా అందంగా తయారు చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మేకప్ లు దొరుకుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎవరికైనా సరే ముఖంలో వారి చిరునవ్వే అందం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకసారి ఎంతో ఆనందంగా చిరునవ్వు నవ్వారూ  అంతే ఇక ముఖం ఒక్కసారిగా వెలిగిపోతూ ఉంటుంది.



 అయితే అందమైన చిరునవ్వు కావాలి అంటే అటు పెదాలు  కూడా ఎంతో అందంగా ఉండాల్సి ఉంటుంది.  పెదాలు  ఎప్పుడు నల్లగా మారుతూ ఉండడం లాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఎదుర్కొంటున్నారు అనే విషయం తెలిసిందే. మరికొంతమంది వారి ఆహారపు అలవాట్ల కారణంగా పెదాలు రంగు మారుతూ ఉండడం కూడా గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అందంగా కనిపించడానికి లిప్స్టిక్ లాంటివి  రుద్దుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది లిప్స్టిక్ లేకుండానే తమ పెదాలను అందంగా ఉంచుకోవాలని  భావిస్తూ ఉంటారు.



 అయితే ఒకవేళ మీ పెదాలు తరచూ రంగు మారుతూ ఉంటే.. కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు పెదాలను కాంతివంతంగా అందంగా మార్చుకోవచ్చు అని సూచిస్తున్నారు నిపుణులు.  తేనె పోసి కాసేపు ఉంచి నీటితో కడిగేస్తే పెదాలుఅందంగా మారుతాయట. అంతే  కాదు గ్రీన్ టీ తాగితే కూడా ప్రయోజనం ఉంటుందట. పొడిబారిన పగిలిన పెదాలపై కొబ్బరినూనె రాస్తే ఎంతో ప్రయోజనం వుంటుందట అంతేకాకుండా టమాటా ను పేస్ట్ గా  చేసి తలకు రాస్తే పెదాలు మంచి రంగు లోకి వస్తాయట. అంతేకాకుండా కుంకుమపువ్వును పెదాలపై రాసి కాసేపు ఆగి కడిగేయటం  వల్ల కూడా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: