ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు ఒక పేరు ఉంది. ఇచ్చిన మాట తప్పడు అని. ప్రజలకు ఇచ్చిన హామీలు తో పాటు పార్టీ నేతలు ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేరుస్తారని పేరుంది. కానీ ఓ నేత విషయంలో మాత్రం సీఎం జగన్ తన హామీని నిలబెట్టుకోలేదని వాదన వినిపిస్తోంది. ఇందుకు కారణం త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అనంతరం ఆ పార్టీలో పదవులు ఆశించే వారంతా నిరాశలో కూరుకుపోయారు.

 ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేత ముర్రి రాజశేఖర్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేటలో ప్రచారం నిర్వహించిన వైఎస్ జగన్ మర్రి రాజశేఖర్ త్యాగమూర్తి పొద్దున ఎమ్మెల్సీ ని చేసి మంత్రిమండలిలో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట సీటును ఆశించారు. అయితే అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలువరించాలి అంటే సౌమ్యుడు మృదుస్వభావి ఆయన మర్రి రాజశేఖర్ సరిపోరని ఈ విషయంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న విడుదల రజిని అయితే మంచిదనే భావనతో జగన్ ఆమె వైపు మొగ్గు చూపారు.


 అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న మరియు రాజశేఖర్ కి మంత్రి పదవి ఇస్తానని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ అప్పటి నుండి మూడు సార్లు మండలిలో ఖాళీ ఏర్పడినప్పటికీ మరియు రాజశేఖర్ కి మొండి చేయి చూపిస్తూ వచ్చారు. అయితే ఈసారి ఏకంగా ఆరు స్థానాలు ఖాళీ అవ్వడం తో జగన్ తనకు అవకాశం కల్పిస్తారని భావించారు. అలాగే మంత్రివర్గంలో కూడా తోడు దక్కుతుందని భావించారు. అయితే వైసిపి మరణించిన జాబితాలో మర్రి రాజశేఖర్ పేరు లేదు.


 లిస్టులో  మర్రి రాజశేఖర్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు స్థానిక కార్యకర్తల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మర్రి రాజశేఖర్ పదవి రాకుండా ఎమ్మెల్యే రజనీ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే చిన్నప్పటి నుంచి మంచి పదవి కోసం ట్రై చేస్తున్న విడుదల రజిని సీఎంవో లోని ఓ ముఖ్య నేత ద్వారా మర్రి రాజశేఖర్ ను అడ్డుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మర్రి రాజశేఖర్ కి  ఎమ్మెల్సీ పదవి వస్తే మంత్రి పదవి రేసులో తన వెనక పడతానని రజిని భావిస్తున్నట్లు మర్రి రాజశేఖర్ వర్గం ఆరోపిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: