ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైయస్ షర్మిల త్వరలో పార్టీ ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఎక్కడ తన పార్టీ ఆంధ్ర పార్టీ అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందులో భాగంగా పార్టీలోకి వచ్చే నేత ఎంపిక ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు షర్మిల  సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్ని తెలంగాణ లో కూడా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించు నాయి.


 ముఖ్యంగా టిడిపి 2014 ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసింది. కెసిఆర్ చంద్రబాబు ల మధ్య మాటల యుద్ధాలు నువ్వా నేనా అన్నట్లు కూడా సాగాయి. అయితే చంద్రబాబు పార్టీ ఆంధ్ర పార్టీ అని మళ్లీ ఆంధ్రోళ్ల కీ కట్ట పెడతారా అనే స్లొగన్ ను తెలంగాణ ప్రజలు బాగా చోటు దక్కించుకున్నారు. దీంతో తెలంగాణలో కూడా బాగా వేద్దామనుకున్నా బాబు ఆలోచనలకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. అప్పటినుంచి పార్టీకి తెలంగాణలో వింగ్ ఉన్నప్పటికీ ఏదో ఉంది అనే విధంగా ఉంది తప్ప పెద్ద ప్రభావం చూపడం లేదు. ఇక వైసీపీ పరిస్థితి చెప్పనవసరం లేదు. అప్పటి ఎన్నికల్లో కాస్త మెరుగైన ఫలితాలు చూపించిన క జగన్కు కేసీఆర్ తో  కేసీఆర్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వలన పెద్దగా మాట్లాడలేని పరిస్థితి.


 అయితే ఇప్పుడు తాజాగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ ఈ స్థానికత అంశం రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మళ్లీ ఆంధ్ర పాలన అనే అంశం తెరపైకి వచ్చి పార్టీ ప్రారంభంలోనే ఏమైనా నష్టాన్ని చేకూర్చుతుంది అనే భయం వ్యక్తం చేస్తున్నారు షర్మిల అనుచరులు. అందులో భాగంగానే షర్మిల  పెట్టబోయే కొత్త పార్టీలోకి వచ్చిన నేతలు ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లోటాస్ పౌండ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఏపీలో కొందరు నేతల  దగ్గర నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీకి చేరతామని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిపై  షర్మిల ఏం  స్పందించలేదని తెలుస్తోంది.


 పార్టీ ప్రకటించిన రోజే తన స్థానికత గురించి స్పష్టమైన స్పీచ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మాటకొస్తే కేసీఆర్ విజయశాంతిలు కూడా తెలంగాణ వాళ్ళ అనే వాదనను మళ్ళీ తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే మొన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో తన స్థానికతను గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు షర్మిల. దీంతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి సమస్యలు తీరాయి అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ ప్రజల సమస్యలు తీరడం కావాలా లేక స్థానికతలు కావాలా అనే పాయింట్ ను ఆమె పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి పార్టీ పెట్టడానికి ముందే షర్మిల ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే అన్ని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ప్రిపేరై  ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: