పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మరోసారి మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆమె మోడీ, అమిత్‌షా ద్వయంపై నిప్పులు చెరిగారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. ఒక్క బెంగాల్, అసోంలోనే ఒకటి కంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరుగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లో 8 విడతలుగా.. అసోంలో రెండు విడతలుగా ఎన్నికల షెడ్యూల్‌ ఉంది. ఒక్క బెంగాల్‌లోనే 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడం ఏంటని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ, అమిత్‌ షా చెప్పినట్టే ఈసీ నడుచుకుంటోందా అంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ వర్గాల నుంచి నాకు సమాచారం అందిందని... వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం మోడీ, అమిత్‌ షా ఎన్నికల సంఘాన్ని కూడా  వాడుతున్నారని మమత బెనర్జీ విమర్శించారు. అయితే తన దగ్గర బీజేపీ పప్పులు ఉడకవని అంటున్నారు మమత.  

"ఈ సారి ఆటలో మిమ్మల్ని మరోసారి చిత్తుగా ఓడిస్తాను.. దెబ్బకు దెయ్యం వదిలిస్తాను.. నేను బెంగాల్‌ పుత్రికను. బీజేపీ కంటే నాకే ఈ రాష్ట్రం గురించి ఎక్కువగా తెలుసు. ఎనిమిది విడతలు అయినా గెలుపు మాదే. మీ కుట్రలన్నీ ఛేదిస్తాను..” అంటూ శపథం చేస్తున్నారు. అంతే కాదు.. మోడీ, అమిత్‌ షా చేసిన  అవమానానికి బెంగాల్‌ ప్రజలు కచ్చితంగా బదులు తీర్చుకుంటారంటున్నారు మమత.. మీకు వాయింపులు తప్పవు.. దేశంలో ఉన్న ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి మీద మీ కక్షసాధింపు చర్యలు అందరూ గమనిస్తున్నారు  అంటూ మోడీ, అమిత్ షాపైమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: