ప్రముఖ ఈ - కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు కస్టమర్లను పెంచుకుంటూ పోవాలని భావిస్తున్నది. అందుకోసం వరుసగా ఎలెక్ట్రానిక్ వస్తువుల పై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు..ఈ ఆఫర్లు ఈ రోజు ప్రారంభం కాగా, 28 వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. 'సమ్మర్ అప్లయన్స్ ఫెస్టివల్' పేరుతో వోల్టాస్, ఎల్జీ, డాకిన్, వర్ల్‌ఫూల్, శామ్సంగ్, సింఫనీ, గోద్రేజ్, కంపెనీలకు చెందిన బ్రాండ్లపై అమెజాన్ పెద్దమొత్తంలో రాయితీలను ప్రకటించింది. అంతేకాకుండా... కొనుగోలుదారులు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే .. ఈఎంఐలపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.


ఎల్జీ, శామ్‌సంగ్, వర్ల్‌పూల్, హైయర్, గోద్రేజ్ తదితర బ్రాండ్ల రిఫ్రిజిరేటర్లపై 35 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. తక్కువ విద్యుత్తును వినియోగించుకునే రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ. 13,790 గా పేర్కొంది. ఆ తర్వాతి శ్రేణి రిఫ్రిజిరేటర్ల ప్రారంభ ధర రూ . 21,290 గా నిర్ణయించింది. మరోవైపు... ఎక్సేంజ్‌పై కూడా రూ . 12 వేల వరకు రాయితీలనిస్తోంది. రిఫ్రిజిరేటర్లలో 60 కి పైగా కొత్త బ్రాండ్‌లపై కనీసం 10 శాతం తగ్గింపునిస్తోంది. వర్ల్‌పూల్, శామ్‌సంగ్, ఎల్‌జీ, గోద్రేజ్, హైయర్ తదితర బ్రాండ్లలోనూ కొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది..


ఇక ఏసి ల పై ఆఫర్ ను ఒకసారి గమనిస్తే..


వోల్టాస్, డాకిన్, ఎల్‌జి, వర్ల్‌పూల్, సాన్యో, తదితర బ్రాండ్లకు చెందిన ఎయిర్ కండీషనర్లపై 40 % వరకు రాయితీ ప్రకటించింది. అయితే, ఈ బ్రాండ్ల ప్రారంభ ధరను మాత్రం రూ . 22,999 గా నిర్ణయించింది. విండో ప్రారంభం ధర ధర రూ. 17,490. అమెజాన్ ఏసీ మోడళ్లను బట్టి వాటి బేసిక్ ప్రైస్‌ను రూ .22,499 గా నిర్ణయించింది. ఎల్‌జి, వోల్టాస్, పానాసోనిక్, టీసీఎల్ వంటి బ్రాండ్లకు సంబంధించి ఎస్‌బీలు, స్మార్ట్ ఏసిలలో 50 కి పైగా కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసువకుచ్చింది.. వీటితో పాటుగా కొత్తగా మార్కె ట్ లోకి వచ్చిన అన్ని కంపెనీల పై కూడా ఆఫర్లను అందిస్తున్నారు.


కూలర్స్ పై కూడా భారీ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..

సింఫనీ, క్రాంప్టన్, బజాజ్, హావెల్స్ టాప్ బ్రాండ్లపై 50 % వరకు తగ్గింపునిస్తోంది. ఓరియంట్ తదితర బ్రాండ్లను అమ్మకానికి ఉంచింది.


చూసారుగా కేవలం రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.. త్వరపడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: