ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గం యాక్టివ్ కానుంది. దాదాపు 5 కార్పొరేష న్ల ప‌రిధిలో కాపు ఓటర్లు.. కీల‌కం కానున్నారు. దీంతో ఆ సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌వైపు తిప్పుకొనేందుకు అ న్ని పార్టీలూ ప్ర‌ధానంగా దృష్టి సారించాయి. అయితే.. త‌మ స‌మ‌స్య‌లు ఇప్ప‌టికీ ప‌రిష్కారం కాలేద‌ని ఆవే ద‌న వ్య‌క్తం చేస్తున్న‌కాపులు.. ఇప్పుడు ఎటు మొగ్గుతారు?  ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు?  అనేది స్ప‌ష్టం కావాల్సి ఉంది. విజ‌య‌వాడ‌, గుంటూరు, తుని(మునిసిపాలిటీ), రాజ‌మండ్రి, ఏలూరుల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో కాపుల ఓట్లు అత్య‌ధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. కాపు సామాజిక వ‌ర్గం జ‌న‌సేన వైపు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. పార్టీ ర‌హితంగా సాగిన ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎటువైపు నిల‌బ‌డ్డార‌నేది పూర్తిగా స్ప‌ష్టం కాలేదు. ఇక‌, ఇప్పుడు కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌కు పార్టీ గుర్తుల‌పై జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాపులు ఏ పార్టీకి మొగ్గు చూపుతార‌నేది ఆస‌క్తిగా మారింది. అధికార పార్టీ విష‌యాన్ని తీసుకుంటే.. గ‌తంలో చంద్ర‌బాబు కాపుల‌కు ఇచ్చిన అగ్ర‌వ‌ర్ణ ఆర్థిక పేద‌ల‌కు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో ఐదు శాతాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డం లేదు.

అదే స‌మ‌యంలో కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి, యువ ఎమ్మెల్యేను దీనికి చైర్మ‌న్‌గా నియ‌మించినా.. నిధుల విష‌యంలో చూపిస్తున్న ఉదాశీన‌త కారణంగా కాపు సామాజిక వ‌ర్గానికి ఈ కార్పొరేష‌న్ చేరువ కాలేక పోయింది. దీంతో అధికార పార్టీపై ఒకింత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. ఇదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షం టీడీపీని కూడా న‌మ్ముదామా? వ‌ద్దా అనే విష‌యంలో కాపుల మ‌ధ్య ఊగిస‌లాట కొన‌సాగుతోంది. అయితే.. జ‌న‌సేన విష‌యంలోనూ ఇదే త‌ర‌హా ఉన్న‌ప్ప‌టికీ.. `మ‌నోడు` అనే ఉదార‌త ప‌వ‌న్‌పై చూపిస్తే.. ఖ‌చ్చితంగా జ‌న‌సేన పుంజుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి: