బ్రాహ్మ‌ణ వాణి.. చ‌ట్ట‌స‌భ‌ల్లో వినిపించి చాలా కాల‌మే అయిపోయింది. గ‌త ప‌దేహేనేళ్లుగా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కుపెద్ద‌గా వెళ్ల‌డం లేదు. వెళ్లిన వారిలోనూ ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. ఎక్కువ మంది ఉండ‌డంలేదు. అస‌లు కొన్ని పార్టీలు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి టికెట్లు కూడా ఇవ్వ‌డం లేదు. ఇచ్చిన చోట కూడా చాలా త‌క్కువ మంది విజ‌యం సాధిస్తున్నారు. దీంతో అటు పార్ల‌మెంటులోను... ఇటు రాష్ట్ర అసెంబ్లీలోనూ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల వాయిస్ వినిపించ‌డం లేదు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఈ గ్యాప్‌ను స‌ర్దుబాటు చేసేందుకు ప్ర‌య‌త్నించారు.

రాజ‌మండ్రి ఎంపీ టికెట్‌ను ఆయ‌న రెండు సార్లు కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ఇచ్చారు. ఇక‌, బాప‌ట్ల‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా విశాఖ‌లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇదే పంథాను ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ అనుస‌రించినా.. ఇద్ద‌రు మాత్ర‌మే అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. పోనీ.. మిగిలిన వారు ఓడిపోయినా.. వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మండ‌లికి పంపాల‌నే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ .. జ‌గ‌న్ ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఆరుగురిని మండ‌లికి పంపే అవ‌కాశం వ‌చ్చింది.

అయితే.. వీరిలో ఏ ఒక్క‌రూ కూడా బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ద్రోణంరాజు ఫ్యామిలీ నుంచి ఒక‌రిని పంపించినా.. ఆయన మ‌ర‌ణించారు. ఈ స్థానంలోనూ బ్రాహ్మ‌ణ వ‌ర్గాన్ని ఎంపిక‌చేయ‌లేదు. దీంతో ఉన్న ఒక్క‌పార్టీ కూడా బ్రాహ్మ‌ణుల‌కు ప్రాధాన్యం త‌గ్గించ‌ద‌నే ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా అయితే..వ‌చ్చే రోజుల్లో మ‌రింత‌గా వీరి ప్రాధాన్యం రాజ‌కీయంగా త‌గ్గుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికైనా.. అధికార ప్ర‌తిప‌క్షాలు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల‌నే డిమాండ్లు వినిపి‌స్తున్నాయి. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: