ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సైబర్‌ క్రైమ్ పోలీసులు శుక్ర‌వారం రాత్రి ఆరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని చంద్రాయణ్‌గుట్టకు చెందిన మహ్మద్‌ అబు ఫైసల్‌ ఆలియాస్‌ మహ్మద్‌ లతీఫ్ గ‌త 11 నెల‌ల క్రితం ఓ వ‌ర్గాన్ని ఉద్దేశిస్తూ  సోషల్‌ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టాడు. అప్పట్లో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లతీఫ్ ఆచూకీ చిక్క‌లేదు. దుబాయ్‌లో తలదాచుకుంటున్నాడు. నిందితుడు శుక్ర‌వారం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న‌ట్లుగా స‌మాచారం అందుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టులో లుకౌట్‌ నోటీసుల ఆదేశాలు జారీ చేశారు.


ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. లతీఫ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పోలీసులు అతన్ని ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.సోషల్‌ మీడియా ముసుగులో అసలు మీడియా కంటే ఆకతాయిల అలజడి ఎక్కువైంది. ఓ వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ అసభ్యకర, తప్పుడు మెసేజ్‌లు పోస్టు చేస్తూ లేనిపోని తంటాలు తీసుకువస్తున్నారు. వీటిపై నియంత్రణ లేకపోతే పరిణామాలు తప్పవనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అందుకే సోషల్‌ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కట్టడికి ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది కేంద్రం. డిజిటల్‌ న్యూస్‌, ఇతర ఆన్‌లైన్‌ కంటెంట్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టనుంది.


న్యూస్‌ పోర్టళ్లు, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌ను కూడా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.  రక్షణ, విదేశాంగ, హోం, సమాచార ప్రసార, న్యాయ, ఐటీ, మహిళా శిశు అభివృద్ధి శాఖలకు చెందిన ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేస్తారు. కోడ్ ను ఉల్లంఘించినట్టు తేలితే సుమోటాగా దానిపై విచారణ జరిపే హక్కు కమిటీకి ఉంటుంది. అలాంటి కంటెంట్ ను బ్లాక్ చేసేందుకు జాయింట్ సెక్రటరీ లేదా ఆపై హోదా ఉన్న అధికారిని ‘ఆథరైజ్డ్ ఆఫీసర్’గా నియమించనుంది.  భారత సార్వభౌమత్వం, సమగ్రతను దెబ్బతీసే, దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే డేటా ప్రసారంపై ఆ చట్టం ద్వారా నిషేధం విధించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: