ఏపీలో పుర‌పాలిక‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. ఈ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గ‌త యేడాది విడుద‌ల చేయ‌డంతో మ‌ళ్లీ తిరిగి కొత్త నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని ప‌లువురు హైకోర్టును ఆశ్ర‌యించారు. నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి  మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ప‌ల్లె పోరులో వైసీపీ పై చేయి సాధించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌ట్ట‌ణ పోరు పైనే ఉంది. ఎంత లేద‌న్నా ప‌ల్లెల్లో వైసీపీకి మొగ్గు ఉంటే. ప‌ట్ట‌ణాల్లో ఆ స్థాయిలో అనుకూల లేద‌న్న నివేదిక‌లు అయితే ఉన్నాయి. వైసీపీ గ‌తేడాది తిరుగులేని విజ‌యం సాధించినా ప‌ల్లె ప్రాంతాల్లో ఆ పార్టీకి వ‌చ్చిన ఓట్ల‌తో పోలిస్తే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో చాలా త‌క్కువ ఓట్లే వ‌చ్చాయ‌ని చెప్పాలి. అందుకే ప‌ట్ట‌ణాల్లో టీడీపీకి ఎక్కువ సీట్లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు జ‌గ‌న్‌కు ప‌ట్ట‌ణాల్లో కొన్ని చోట్ల అయినా దెబ్బ ప‌డుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇరవై నెలలుగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన జగన్ అభివృద్ధి వైపు కన్నెత్తి చూడలేదు. ఇది పట్టణ ఓటర్లపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. ఇక దీనికి తోడు ఇసుక కొర‌త‌, ప‌ట్ట‌ణాల్లో తాగునీటి ఇబ్బందులు... రోడ్ల దుస్థితి... పెట్రోల్ ధ‌ర‌ల‌పై ఏపీ ప్ర‌భుత్వం అద‌న‌పు ప‌న్నులు... ఇవ‌న్నీ వైసీపీకి మైన‌స్‌గా.. త‌మ‌కు ప్ల‌స్ అవుతాయ‌ని టీడీపీ లెక్క వేస్తోంది. మ‌రి వీరిలో ఎవ‌రి అంచ‌నాలు నిజం అవుతాయో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: