భారత్లో శరవేగంగా వ్యాపించిన కరోనా  వైరస్ ఎంతలా  అతలాకుతలం చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. శరవేగంగా వ్యాప్తిచెంది ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది మహమ్మారి వైరస్. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తప్పనిసరి గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇలా మాస్క్ ధరించడం తప్పనిసరి గా మారిపోయింది. అయితే కరోనా వైరస్ పై పూర్తి స్థాయిలో అవగాహన తో ఉన్న ప్రజలందరూ ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా మాస్కు ధరించి బయటకు వెళ్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 మాస్కులు లేకుండా ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా ప్రజలందరూ అవగాహన వచ్చి మాస్క్ ధరించడం వల్ల కరోనా వైరస్  దేశంలో కంట్రోల్ కావడానికి కారణం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కూడా కొంతమంది మాస్కులు ధరించడం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి కొన్ని ఘటనలు తెరమీదికి వస్తూనే ఉంది. ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు కానీ అది ముక్కు నోరు కవర్ అయ్యేలా మాత్రం  పెట్టుకోవడం లేదు. వెరసి కరోనా వైరస్ వ్యాప్తికి కారకులుగా మారిపోతున్నారు.



 ప్రస్తుతం మహారాష్ట్ర లో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా మాస్కు ధరించి ఉన్న ఫోటో  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ ను నియంత్రించే మాస్క్ ను  ముక్కు నోటికి కాకుండా కళ్ళకు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్న  ఓ వ్యక్తి లోకల్ ట్రైన్లో ప్రయాణించాడు.. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరిగి పోవడానికి ఇది కూడా ఒక కారణమని ఇలాంటి ప్రయాణాలను ప్రోత్సహించకూడదు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: