ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిపోయినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  కావాల్సిన ప్రతి సమాచారం కూడా సోషల్ మీడియా వేదికగా దొరుకుతూ ఉండడంతో ఇక ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను గంటల తరబడి వాడుతున్నారు అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడో జరిగిన విషయం కూడా క్షణాల వ్యవధిలో అరచేతిలో వాలి పోతూ ఉండడంతో ఇక సోషల్ మీడియా వాడకం అంతకంతకు పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే.



 అయితే సోషల్ మీడియా వాడకం పెరగడం ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఫేక్ న్యూస్ లు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏది నిజమైన వార్త.. ఏది ఫేక్ న్యూస్ అని తెలియక ప్రజలు అందరూ ఆందోళనలో మునిగిపోతున్నారు. అయోమయంలో పడిపోతున్నారు.  ఈ క్రమంలోనే ఇలాంటి ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే.  సోషల్ మీడియా వేదికల్లో ముందుగా ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన వ్యక్తిఎవరు అనేది గుర్తించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ పేరుతో కేంద్రం కొత్తగా నిబంధనలు తీసుకువచ్చింది. అయితే ఈ నిబంధనలు ప్రస్తుతం భారతదేశంలో అతి ఎక్కువగా వాడుకలో ఉన్న వాట్సాప్ కి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రూల్స్ ప్రకారం ఫేక్ మెసేజ్లు మొదట ఎక్కడ నుంచి ఫార్వర్డ్ అయ్యాయి అన్నది ఆయా సోషల్ మీడియా వేదికలు .. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇలాగే ఒక మెసేజ్ మూలాలను కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ ని అడిగినప్పుడు ఆ వివరాలను వెల్లడించేందుకు వాట్సాప్ అంగీకరించలేదు.  ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త రూల్స్ పాటించకపోతే వాట్సప్ సహా ఇతర మెసేజింగ్ యాప్ లకు  కూడా ఇబ్బందులు తప్పే అవకాశం లేదు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: