మనం మన గృహం మందిరంలో ప్రతినిత్యం చేసుకొనే  పూజ సంకల్పంలో పరమాత్మకు మన “ఐడెంటిటీ - అంటే సమాజంలో మన స్థానం” అంటే సరళంగా చెప్పాలంటే మన అనంత విశ్వంలో మానమున్న స్థానం - ఆధ్యాత్మిక చిరునామా - గా విన్నవించు కొంటాం! అదేమంటే:


: “ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే ‘జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే’, మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే …… “అంటూ మన చిరునామా గోత్రనామాలు విన్నవించి పూజ ప్రారంభిస్తాం. 


ఇక్కడ * ‘జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అనే అఖండ సువిశాల భారతాన్ని స్మరించుకుంటాం. " జంబూద్వీపం సప్త ద్వీపాల్లో ఒకటి. ఆ ద్వీపంలో భరతవర్షం లేదా అఖండభారత్  ఒక భాగం. ఆ భరత వర్షంలో భరతఖండం ఉందని, ఆ భరతఖండంలో మేరుపర్వతానికి దక్షిణ భాగంలో ... మనమున్నామని అర్ధం . అయితే అంత విశాల భారతం ముక్క చెక్క లైంది నేడు.


అయితే “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” సరళంగా - ఆర్ ఎస్ ఎస్  - పరివార్ అగ్రనేత మోహన్ భగవత్ నోటి నుంచి ఆసక్తి కర వ్యాఖ్య ఒకటి వచ్చింది. “అఖండ్ భారత్” అంటూ ఆర్ ఎస్ ఎస్ మౌలిక సూత్రాన్ని ఆయన తాజాగా ప్రస్తావించారు.


హైదరాబాద్ లో మాడగుల నాగఫణిశర్మ విరచిత “సప్న @ 32” పుస్తక ఆవిష్కరణ కోసం హాజరైన ఆయన, కాలకూట విషాన్ని గరళంలో ఉంచు కొని శివుడు ప్రపంచాలను కాపాడాడని, అదే రీతిలో ప్రపంచంలో కలిగే అనేక విపత్తులు, వికృతుల నుంచి ప్రపంచాన్ని కాపాడ గలిగేది భారత దేశం మాత్రమేనని, ఆ విషయాన్ని అన్నిదేశాలు గుర్తిస్తున్నాయన్నారు. ఇక్కడ అఖండ భారతం అంటే పలు దేశాల సమన్వయ సనాతన భారత ధర్మం వికసించిన నేల అనాలి.


ధర్మానికి కేంద్ర బిందువైన భారత్ నుంచి విడిపోయిన దేశాలు ప్రత్యేకంగా ఏర్పడినా, అవి నేటికి అశాంతి, అలజడి, అంతర్యుద్ధాలతో కొట్టు మిట్టాడుతు ఉ ఉన్నాయన్న - విషయాన్ని మోహన్ భగవత్ గుర్తు చేశారు.


దేశం నుంచి విడిపోయిన భూఖండాలు (భాగాలు) సువిశాల ప్రయోజనాలను ఆశించి - భవిష్యత్తులో తిరిగి భారత్ లో మళ్ళీ కలువ వచ్చేమో? అన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇదే కార్యక్రమంలో పుస్తకాన్ని రచించిన మాడగుల నాగఫణిశర్మ కార్యక్రమ విశిష్ఠతను వివరిస్తూ, ఒకప్పుడు భూమండలమంతా భారతధర్మమే విస్తరించి ఉండేదన్నారు. అలాంటి ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి భుజస్కందాల మీద ఉందన్నారు.


విడిపోయిన రాష్ట్రాలే కలిసేందుకు సిద్ధంగా లేని వేళ, విడిపోయిన దేశాలు కలవటం, అందునా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు కలుస్తాయన్న మాటలు వాస్తవానికి చాలా దూరమని చెప్పక తప్పదు.


సంఘ్ పరివార్ తరచూ కలగనే మాటల్ని ఆ సంస్థ అధినేత మరోసారి వ్యాఖ్యానించారని చెప్పక తప్పదు.


అయితే  విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలవని సందర్భం ఉదహరించిన వారికి  – చెప్పేదోకటే, “తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీ” లు ప్రపంచయుద్ధంలో దారుణంగా విభజిచబడి మళ్లీ కలిసి పోలేదా?




ఆశ, ఆలోచన, వ్యూహం, అనుసరణ, అమలు చేయటం - అన్నిటికి మూలం. మోహన్ భగవత్ మదిలో వెలిగే ఆసూక్ష్మ దీపం అఖండంగా – ఆకాశ దీపంగా ప్రజ్వరిల్లదని హామీ ఏమైనా ఉందా! “ప్రేరణ దైవానిదైతే సాధించేది నరుడే కదా” లెట్ అజ్ విష్!



*జంబూద్వీపం గురించి వివరణ మరో వ్యాసంలో వివరిస్తుంది - ఇండియా హెరాల్డ్ -





మరింత సమాచారం తెలుసుకోండి: