సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళినా సరే కొన్ని కొన్ని సమస్యలు లోపాలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. చాలామంది మంత్రులకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అసలు ఏమాత్రం కూడా అవగాహన లేదు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కొంతమంది మంత్రులు సంక్షేమ కార్యక్రమాలను కనీసం అర్థం చేసుకోలేకపోతున్నారనే ఆవేదన కూడా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉంది అని చెప్పాలి. ఎమ్మెల్యేలు కూడా అసలు సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు జరుగుతున్నాయి అనేది తెలియదు.

ఎంత ఖర్చు చేస్తున్నారు... నియోజకవర్గంలో ఎంతమందికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో కూడా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు. మంత్రులకు కూడా ఈ విషయంలో పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇప్పుడు పార్టీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నా సరే ఆ పార్టీకి ధీటుగా సమాధానం ఇవ్వలేక పోతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఎవరైనా సరే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగకపోయినా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించ లేకపోయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చాలా మంది ఎమ్మెల్యేలు అసలు మీడియాతో కూడా మాట్లాడటంలేదు. సంక్షేమ కార్యక్రమాలు లెక్కలను కూడా వివరించడం లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా చెప్పుకోలేని స్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే త్వరలో జిల్లాల వారీగా క్లాసులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారట. అంతేకాదు తాను కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: