దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోలేదు అంటే మాత్రం ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బకు కొన్ని సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పార్టీ అర్థం చేసుకోలేక పోతుంది.

ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంచనా వేయలేకపోతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అధికారంలోకి రావాలి అనే తపనతో కేంద్ర ప్రభుత్వం కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ధరల పెరుగుదల విషయంలో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అనే విషయం స్పష్టంగా తెలిసు.

అప్పట్లో ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేసి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో అదే జరుగుతుంది అని చెప్పాలి. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోకుండా పరిపాలన ఇష్టం వచ్చినట్టు చేయడం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఇప్పుడు ప్రైవేట్ రంగానికి అమ్మడంతో ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. దీంతో రాజకీయంగా ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ప్రతీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావించి కొంతమంది ముఖ్యమంత్రులను మానసికంగా కూడా వేధించే రాజకీయం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చెప్పాలి. మరి ఈ రాజకీయం ఇకనైనా ఆపుతారా లేకపోతే ఇలాగే కొనసాగిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: