ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని పంచాయతీల్లో వైసిపి అనుకున్న విధంగా విజయం సాధించలేకపోయింది అనే మాట వాస్తవం. రాజకీయంగా ముఖ్యమంత్రి జగన్ బలంగా ఉన్నా సరే వైసీపీ నేతలు సమర్థవంతంగా పని చేయలేక పోవడంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమిపాలైంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో కొన్ని కమిటీలు వేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఓడిపోయిన నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఏంటనే దానిపై కమిటీలు పనిచేసే అవకాశాలు  ఉన్నాయి.

వాస్తవ నివేదికను ఆరు నెలల్లోగా తనకు ఇవ్వాలని ఈ కమిటీలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముందు నుంచి కూడా వైసీపీలో కొంతమంది నేతలు కష్ట పడటం లేదు అనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వారి మీద దృష్టి పెట్టినట్లు రాజకీయవర్గాలు అంటున్నాయి. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు అలాగే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకోవడం వంటివి వైసీపీ నేతలు చాలా వరకు చేయలేదు అని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

కీలక నేతల నియోజకవర్గాల్లో కూడా కీలక పంచాయతీలను వైసిపి ఓడిపోవడం పై ఆందోళన వ్యక్తమవుతోంది. కడప జిల్లాలో కూడా ఇలాంటివి జరిగాయి. చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా ఇలా ఎక్కువ పంచాయతీలు వైసిపి కోల్పోయినది అని చెప్పాలి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే వై సీ పీ ప్రభావం అనుకున్న విధంగా కనపడలేదు అనే వ్యాఖ్యలు వినిపించాయి. అందుకే జగన్ ఎప్పుడు నష్టనివారణ చర్యలకు దిగుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ కమిటీల ద్వారా పార్టీని ఎంత వరకు ముందుకు తీసుకువెళ్తారు ఎంతవరకు బలోపేతం చేస్తారు అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే వైసీపీ నేతల పనితీరు విషయంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ కాస్త సీరియస్ గానే ఉండే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: