గోవ‌ధ‌పై నిషేధం ఉన్నా లెక్క చేయ‌కుండా వాటి ప్రాణాల‌ను తీస్తున్నారు కొంత‌మంది. డ‌బ్బుల‌కు క‌క్కుర్తిప‌డి ర‌హ‌స్యంగా వాటిని వ‌ధించి మాంసాన్ని విక్ర‌యిస్తున్నారు. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల శివారుల్లో ఇది ష‌రామామ‌లుగా మారింది. అయితే ఇప్పుడు ఇది జిల్లాల్లోనూ జోరుగా సాగుతోంది. అయితే బ‌య‌ట‌ప‌డిన‌వి బ‌హు త‌క్కువ‌గా ఉంటున్నాయి. ఇలాంటి దందానే ఇప్పుడు సిద్ధిపేట జిల్లాలోనూ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. గుట్టు చప్పుడు కాకుండా గోవధకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు.  ఓ పౌల్ట్రీఫామ్‌లో 18 ఆవులను ఊచకోత కోసి వ్యాపారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, బీజేపి నేతలు గో వధను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.



పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు హిందూ సంఘాలకు మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. గోవధ చేసిన దుండగులను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు హిందూ సంఘాల నేతలు. ఇక గోవధ జరుగుతుంటే స్థానిక పోలీసులు, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కూడా దీనిని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌డంతో శ‌నివారం ఉద‌యం గోవధ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వెంట‌నే  జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.  నిందితుల‌కు  14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.



కోర్టు తీర్పు తరువాత 8 మంది నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. అరెస్ట‌యిన  నిందితుల్లో మహ్మద్ జుబేర్, మహ్మద్ ఖాజా,  మహ్మద్ సద్దాం, మహ్మద్ అరఫత్, మహ్మద్ ఇబ్రహీం, మహ్మద్ హర్షద్‌, మహ్మద్ ఆరాఫ్, మహ్మద్ జావిద్ ఉన్నారు.గో వధను నిషేధించడానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో కిరాతకమైన చట్టాలు అమలులో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో గోవధ నిషేధ చట్టాలు లేవు. ఒరిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో షరతులతో కూడిన నిషేధం ఉంది. ఈ రాష్ట్రాలలో పాలివ్వని, పని చేయడానికి పనికి రాని పశువులను మాత్రమే వధించడానికి అనుమతిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: