ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కాస్త స్పీడ్ గా ఉద్యమం నడుస్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో విపక్షాలు అన్నీ కూడా సీరియస్ గానే ఉన్నాయి. రాజకీయంగా ఇప్పుడు కేంద్రాన్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రౌండ్ టేబుల్ సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక, విద్య  సంఘాల నేతలు పాల్గొన్నారు.

పరిరక్షణ వేదిక కన్వినర్ ఓబులేసు మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా మార్చ్ 5నుంచి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాము అని హెచ్చరించారు. నేడు ట్రేడ్,కార్మిక, ప్రజాసంఘాల మద్దతుతో రాస్తరోకో నిర్వహించాము అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేపడతామని ఆయన వివరించారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవటికరించవద్దు అని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. 40 వేల మందికి ఉపాధి ఇస్తున్న వేదిక విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఆయన తెలిపారు.

వ్యాపారాన్ని ప్రోత్సహించి ప్రయివేట్ వ్యక్తులకు అప్పచెపుతామన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాము అని ఆయన స్పష్టం చేసారు. ఆచరణాలు అమలు చేసుకోడానికి కేంద్రం కమిటీ నియమించింది  అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల నిర్ణయం లేకుండా కేంద్రం బరితెగించింది  అని మండిపడ్డారు. దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తాము అని హెచ్చరించారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఏ మాత్రం కూడా తమ ఉద్యమాన్ని ఆపేది లేదని అన్నారు. ప్రజా సంఘాలతో 5న విశాఖ బంద్ అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజలు ఆస్థి అని అన్న ఆయన... మార్చి 3న ప్రభుత్వ రంగా సంస్థల సభ్యులతో సభ  నిర్వహిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజసుకుని  కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: