విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ నేతలు ఎక్కదావేనక్కు తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రం ఎక్కడా కూడా వెనక్కు తగ్గే అవకాశాలు కనపడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా టీడీపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... స్టీల్ ప్లాంట్ విషయం లో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేస్తున్నారు అని ఆరోపించారు.

జూన్ 2019 లో పోస్కో తో సమావేశమై , జులై 2019 లో  సంస్థ ప్రతినిధులు స్టీల్ అధికారులకు ప్రపోసల్ అందజేశారు అని ఆయన వెల్లడించారు. విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అయ్యారు అని అన్నారు. అక్టోబర్ లో ఎం ఓ యూ చేసుకున్నారు అని అన్నారు. సంవత్సరం క్రిందట ముఖ్యమంత్రి కి సమాచారం తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు అని నిలదీశారు. వైసీపీ ఎంపీ లు ఎందుకు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్  విషయం లెవనెత్తలేదు అని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రతి ప్రధాన ఘట్టానికి ముందు వెనుక ముఖ్యమంత్రి జగన్ తో,విజయసాయిరెడ్డి తో పొస్కి ప్రతినిధులు సమావేశం అయ్యారు అని ఆయన అన్నారు.

ఈ విషయాలు పై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఆర్ ఐ ఎన్ ఎల్ కోసం చంద్రబాబు కష్టబడ్డారు అని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు ప్రస్తావించలేదు అని నిలదీశారు. చంద్రబాబు అబివృద్ది చేసిన అన్ని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నాశనం చెయ్యాలి అని చూస్తుంది అని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ను పోస్కో కు కట్టబెట్టిన వారిలో మొదటి ముద్దాయి జగన్ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: