పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాల అభివృద్దితోనే.. రాష్ట్రం, దేశం అభివృద్ది అనేది సాధ్యం అని వెల్లడించారు. ఉద్దానం వంటి ఘటనలతో చాలా మంది వలసలు వెళ్లిపోయారు అన్నారు. చాలా గ్రామాలు కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే ఇంకా నడుస్తున్నాయి అని ఆయన అన్నారు. విజయనగరం పెదిపెంకి గ్రామంలో బోధకాలు ఉన్నా.. పాలకులు ఎవరూ పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. నేడు పంచాయతీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందా అని ప్రశ్నించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నా... అవి ప్రజలకు చేరుతున్న దాఖలాలు కనిపించడంలేదు అన్నారు. మాటల్లో చెప్పిన విధంగా.. ఎక్కడా ఆచరణలో కనిపించడంలేదు అని విమర్శలు చేసారు. జనసేన నాయకులు లేకపోయినా... నేడు జనసైనికులు లేని గ్రామం లేదు  అని అన్నారు. గ్రామాలలో కొత్త నాయకత్వం రావాలి.. అధికార మార్పిడి క్రమక్రమంగా జరగాలి అని అన్నారు. యువత వల్లే అది సాధ్యమని నమ్మి.. వారిని ప్రోత్సహించాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పంచాయతీ ఎన్నికలలో 1209 మంది సర్పంచ్ లు, 1776ఉప సర్పంచ్ లు, 4456 మంది వార్డు సభ్యులు జనసేన మద్దతు కలిగిన వారు గెలుపొందడం సంతోషంగా ఉంది అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 65శాతం పంచాయతీలలో ద్వితీయ స్థానంలో నిలిచాం అని ఆయన అన్నారు. మొత్తం మీద 27శాతం ఓటింగ్ ఈ ఎన్నికలలో జనసేన పొందింది అని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలలో నాకు చాలా తృప్తిని ఇచ్చిన విజయం ఇది అని అన్నారు. ఈ విజయానికి ముఖ్య కారకులు జనసైనకులు మాత్రమే అని ఆయన కొనియాడారు. డబ్బుతో కాకుండా ఆశయాలతో మందుకు వెళ్లాలనుకునే అభ్యుదయ వాదుల విజయం అన్నారు. దాడులు జరుగుతున్నా, అధికార మదంతో రక్తసిక్తం చేసినా.. జనసైనికులు బలంగా నిలబడ్డారు అని కీర్తించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో జనసైనకు దక్కిన విజయం వ్యవస్థలో వస్తున్న మార్పుకు సంకేతం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: