తెలంగాణాలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా ముందుకు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక ప్రతీ అంశంలో కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ కార్యాలయంలో సంత్ శిరోమణి రవిదాస్ మహరాజ్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. సంత్ రవిదాస్ చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్... ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

దళితులే హిందు ధర్మ రక్షకులంటోన్న బండి సంజయ్... కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ కి పేదల జయంతి కార్యక్రమాలు గుర్తుండవని విమర్శలు చేసారు. అంబేడ్కర్, సంత్ రవిదాస్ జయంతి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేయదు? అని నిలదీశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామన్న అంబేద్కర్ భారీ విగ్రహం ఎక్కడ ? అని ఆయన ప్రశ్నించారు. మోచీలకు చెప్పులు కుట్టడమే కాదు..  మొలలు కొట్టడం కూడా వచ్చు  అని అన్నారు.

బీసీ ఆత్మగౌరవ భవనాలు ఎక్కడున్నాయి ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అబద్దలతో ప్రజలను మోసం చేస్తున్నారు  అని ఆయన ఆరోపించారు. దళితులు జాగృతం అయ్యి..  ఏకతాటిపైకి రావాలి అని బండి సంజయ్ కోరారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది బిజెపి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి .. సాగర్ ఉప ఎన్నికపై గురి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టభద్రులే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రులను బిజెపి అధిష్టానం రంగంలోకి దింపుతుంది. వరుసగా కేంద్ర మంత్రులు ఉమ్మడి జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: