ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు చాలా సీరియస్ గా మారింది. విశాఖ ఉక్కుని ఎలాంటి పరిస్థితిలో కూడా అమ్మడానికి వీలు లేదని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వరుస మీడియా సమావేశాలలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాజాగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ పోస్కో వాళ్ళతో చీకటి ఒప్పందం చేసుకున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. చీకటి ఒప్పందాలను సాక్ష్యాలు తో సహా బయటపెడుతున్నాం అని అన్నారు,

ఇప్పటికి స్టీల్ ప్లాంట్ వ్యవహారం ముఖ్యమంత్రి కి తెలియదు అనడం దారుణం అని ఆయన ఆరోపించారు.  విజయసాయిరెడ్డి విశాఖ లో పాదయాత్ర చేయడం కాదు, చిత్తశుద్ధి ఉంటే  ఢిల్లీ లో పాదయాత్ర చెయ్యాలి అని అయ్యన్న డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి జగన్ విశాఖ కు వచ్చి దొంగ స్వామీజీ ని కలిశారు కానీ కార్మికులు వద్దకు ఎందుకు వెళ్ళలేదు అని నిలదీసారు. 7 వేలు ఎకరాలు అమ్మాలి అని ముఖ్యమంత్రి  అనడం బాధాకరం అని అన్నారు. నిజంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని ఉంటే అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు  చేసి, వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాలి అని డిమాండ్ చేసారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి అని కోరారు. విశాఖ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అని ఆయన సూచనలు చేసారు. విజయసాయిరెడ్డి విశాఖ లో మకాం వేసి దోచుకుంటుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని అన్నారు. గత రెండు సంవత్సరాలు గా విశాఖ కు విజయసాయిరెడ్డి ఎం చేశారో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. విశాఖ ను కాపాడుకోవాలి అంటే జీవీఎంసీ ఎన్నికలలో బుద్ధి చెప్పాలి అని విజ్ఞప్తి చేసారు. విశాఖ ఉక్కు ను కాపాడుకోవడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: