ప్రస్తుతం పలు దేశాలు వివిధ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి  అనే విషయం తెలిసిందే. అగ్రరాజ్యాలు ఆర్థిక వ్యవస్థలో దూసుకుపోతుంటే ఆయా దేశాలలో మానవ వనరుల సంక్షోభం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే మానవ వనరుల వృద్ధిరేటు క్రమంగా తగ్గిపోతూ ఉండడంతో ఇక ఆయా దేశాలు ఆర్ధికంగా ఎంతో వృద్ధి రేటు సంపాదిస్తున్నప్పటికీ  రోజు రోజుకు  వృద్ధ జనాభా పెరిగిన దేశాలుగా మారుతుండటంతో ఆయా దేశాలు  అయోమయంలో పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రోజు రోజుకు జననాల సంఖ్య తగ్గిపోతూ ఉన్న నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు ఏకంగా పిల్లలు కనాలి అంటూ  ప్రజలకు ప్రోత్సాహకాలు  కూడా అందిస్తుంది.



 ప్రస్తుతం అధునాతన జీవనశైలిలో భాగంగా.. ఎవరు కూడా పిల్లలను కనడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ పిల్లల్ని కనాలి అనుకున్నప్పటికీ కేవలం ఒక్కరితో  మాత్రమే సరిపెట్టుకుంటూన్నారు. అదే సమయంలో మరణాల రేటు మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలా జననాల సంఖ్య తగ్గి మరణాల రేటు పెరిగి పోవడంతో కొన్ని దేశాలు మానవ వనరుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి అనే విషయం తెలిసింది. ప్రస్తుతం దక్షిణ కొరియా లో కూడా ఇలాంటి తరహా సంక్షబమే  ఏర్పడినట్లు తెలుస్తోంది.


 దక్షిణ కొరియాలో  ఒక సంవత్సరంలోనే జనన మరణాల రేటు 10 శాతం తగ్గినట్లు  దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చనిపోయిన టువంటి వారి సంఖ్యను పుట్టినటువంటి వారి సంఖ్య తో పోల్చి చూస్తే చనిపోయిన వారి సంఖ్య పుట్టిన వారి సంఖ్య కంటే పది శాతం గత  ఏడాది ఎక్కువ అయినట్లు అక్కడి ప్రభుత్వం గురించింది. ఇలా దక్షిణ కొరియాలో వృద్ధుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇక అక్కడ మానవ వనరుల సంక్షోభం ఏర్పడి  పూర్తిగా యువత కరువై వృద్ధ సమాజం పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి వినూత్న కార్యాచరణకు సిద్ధమవుతోంది దక్షిణ కొరియా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: