ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కమ్మ సామాజికవర్గ నేతలు పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతున్నది. పార్టీ మారుతారు అంటూ సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా మన వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే పార్టీ మారతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ నుంచి వచ్చే ఇబ్బందులపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంత మంది అగ్ర నేతలు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన కొంతమంది బీజేపీ నేతలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు బిజెపి ఎంపీ సుజనాచౌదరి అలాగే మరో ఎంపీ సీఎం రమేష్ పదేపదే టార్గెట్ చేయడంతో తెలగుదేశం పార్టీ నేతలు కూడా కాస్త కంగారు పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు వారిని కాపాడు కోవడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సుజనా చౌదరితో ఇటీవల మాట్లాడిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వారిని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీకు ఓనమాలు నేర్పినది అలాంటి పార్టీకి అన్యాయం చేయవద్దని చంద్రబాబునాయుడు సుజనాచౌదరికి సూచనలు చేసినట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం భవిష్యత్తులో వ్యక్తిగతంగా ఇబ్బందులు పడతారని సుజనాచౌదరికి చంద్రబాబు నాయుడు సూచించారట. చౌదరి ఇటీవల కృష్ణా జిల్లాలో ఉన్న ఇద్దరు ముగ్గురు కమ్మ సామాజిక వర్గం నేతలతో చర్చలు జరిపారని ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: